నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Ponguleti Srinivas Reddy


గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొత్తగూడెం నియోజక వర్గం నుండి పోటీ చేయక పోవడంపై రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కొత్తగూడెంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనిపై సుధీర్ఘమైన వివరణ ఇచ్చారు.

"ఆనాడు అసెంబ్లీ ఎన్నికల టైంలో కొత్తగూడెం నుండి కంటెస్ట్ చేయాలని నాకూ వుందీ ... మీకూ వుందీ ... మనందరికీ వుందీ ... అదే పద్దతిలో కష్ట పడి పని చేశారు.  కానీ, రాజకీయాల్లో కొన్ని అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మనిషికే వస్తుంటాయి అవి. మనిషికి వచ్చినప్పుడు తప్పకుండా మనం ఆ సందర్భాలను కూడా ఎదుర్కొని, నడవ గలిగినప్పుడే రాజకీయాల్లో నిలదొక్కుకో గలుగుతాం. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం, పొత్తుల్లో భాగంగా, ఆనాడు మన కొత్తగూడెం సీటును కూనంనేని సాంబశివ రావు గారికి ( సీపీఐ ) ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా నేను కూడా నాలుగైదు ఎన్నికల మీటింగులకు వచ్చాను. మీరు కన్నీరు ... మున్నీరై, కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటును మీరు కమ్యూనిష్టులకు ఇస్తున్నారు ... మా పరిస్థితి ఏంటని ... చాలా మంది ఆడ బిడ్డలు, అన్న దమ్ములు కుమిలి కుమిలి బాధ పడ్డ సంఘటనలను నేను ఇంకా మర్చి పోలేదు. మర్చి పోను కూడా. ఎందుకంటే, ఆ బంధం అలాంటిది. మీ కొత్తగూడెం నియోజక వర్గానికి ... మీ శీనన్నకు ఉన్న బంధం అలాంటిది. అప్పుడే కాదు,ఇప్పుడే కాదు నేను బ్రతికున్నంత కాలం ఆ బంధం అలాగే వుంటుంది. మనిషికి ఒడుదొడుకులు ఎలా వస్తాయో... కష్ట సుఖాలు ఎలా వస్తాయో ... ఆనందాలు బాధాలు ఎలా వస్తాయో తెలియంది కాదు. అవి సర్వ సాధారణం. కష్టమొచ్చినప్పుడు కన్నీరు మున్నీరై బాధ పడే స్వభావం మీకూ లేదు .. నాకూ లేదు. ఆనందమొచ్చినప్పుడు ఎగిరెగిరి గంతు లేసిన సందర్భాలు ఏ నాడూ లేవు. ఉండవు కూడా. అయితే, ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా, సీపీఐ అభ్యర్ధి కూనంనేని సాంబశివ రావు గెలుపు కోసం కాలుకు బలపం కట్టుకొని మీరు పడ్డ శ్రమ వర్ణనాతీతం. ప్రత్యక్ష్యంగా నేను చూశాను. అది ఒక ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం నియోజక వర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించారు. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ అన్నగా నాకు కూడా రాష్ట్ర క్యాబిననేట్లో మంచి స్థానం దక్కింది. అయితే, మీరు అన్ని కష్టాల్లో నా వెనుక నిలబడి అండగా వున్నారన్న సంగతిని నేనెప్పుడూ మర్చి పోను. నేనే ఆనాడు కొత్తగూడెం అసెంబ్లీకి నిలబడి వుంటే, లక్ష మెజార్టీ రావడమన్నది హాస్యాస్పదం కాదు. ఎందుకంటే, ఆ బంధం ... ఆ అన్వోన్యత, ఆ కమిట్మెంట్ అటువంటిది." అంటూ మంత్రి పొంగులేటి బావోధ్వేగా ప్రసంగం చేశారు.

ఏ నిమిషంలోనైనా ప్రకటన రావొచ్చు ... మనకు గ్రూపులోద్దు ... గెలుపే ముఖ్యం  

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఏ నిమిషంలోనైనా ప్రకటన రావొచ్చన్నారు. గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.  పార్టీ సిద్ధాంతమే మన సిద్ధాంతం, పార్టీ ఆలోచనే మన ఆలోచన కావాలని ఉధ్బోధించారు. పార్టీ పదవుల్లోనో, స్థానిక సంస్థల పదవుల్లోనో, ప్రభుత్వ పదవుల్లోనో నాయకులను, కార్యకర్తలను కూర్చోబెట్టే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నిర్ణయం మేరకే కష్ట పడి పని చేసే నాయకుడ్ని, కార్యకర్తను నిలబెడతామన్నారు. పాలేరు నియోజవర్గానికి తాను కేటాయించే సమయం కన్నా, గంట ఎక్కువ కొత్తగూడెం నియోజక వర్గానికి కేటాయిస్తానని పొంగులేటి ఈ సందర్భంగా మాట ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన మాటను గౌరవించి, ఇక్కడ కమ్యూనిష్టు అభ్యర్ధిని గెలిపించినందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నియోజక వర్గం నుండి పోటీ చేయలేక పోవడంపై ఇచ్చిన సుధీర్ఘమైన వివరణ ఇప్పుడు ఇటు పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి